![]() |
![]() |
.webp)
"సుమ అడ్డా" నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ఆర్జే కాజల్, విజె సన్నీ, చలాకి చంటి, సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే చంటికి సమోసాలు ఆఫర్ చేసింది సుమ. "ఫ్రెష్ వేనా" అని అడిగేసరికి "నిజానికి లాస్ట్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేశారు క్యాన్సిల్ అయ్యింది" అనేసరికి "అది అలా చెప్పాలి కదా అప్పుడు తింటాం కదా" అని చంటి అనేసరికి "ఏమైనా అప్పటి మనుషులు అప్పటివే తింటారుగా" అని కామెడీ చేసింది సుమ. తర్వాత సన్నీ, కాజల్ తో గేమ్ షో ఆడించింది. అందులో "పల్లెటూరు అనగానే గుర్తోచ్చేదిమిటి" అనేసరికి కాజల్ "హాఫ్ సారీస్" అని చెప్పింది...ఐతే బోర్డు ఆన్సర్ రాంగ్ అని చెప్పడంతో సన్నీ షాకయ్యాడు. "ఏమిటి లంగా ఓణీలు వేసుకోవడం మానేసారా" అనేసరికి సుమ మధ్యలో వచ్చింది. "మన భారత దేశం యూనిఫామ్ ఏమిటో తెలుసా" అని అడిగింది "జీన్స్ , టి షర్ట్ ఆ" అని అడిగారు సన్నీ, కాజల్.. "కాదు నైటీ" అనేసరికి అందరూ నవ్వేశారు.
తర్వాత ఛత్రపతి మూవీ లోంచి సూరీడు అనే డైలాగ్ తో వచ్చే బిట్ ని సుమ స్పూఫ్ గా చేసి చూపించింది. తర్వాత వెంకటేష్ నటించిన మూవీ పిక్ చూపించేసరికి దానికి ఆ మూవీ టైటిల్ "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" మూవీ అని చంటి ఆన్సర్ చెప్పాడు "ఇది టైటిల్ లా లేదు మీ రియల్ స్టోరీ చెప్తున్నారు ఉంది" అని సుమ ఫన్నీ కౌంటర్ వేసింది. తర్వాత చంటి టీమ్ మొత్తం కూడా ఈ మూవీ బిట్ ని స్పూఫ్ గా చేసి అలరించారు. తర్వాత వీళ్ళతో గేమ్ షో ఆడించింది "చిన్నప్పుడు ఎలాంటి దొంగతనాలు చేస్తూ ఉండేవారు" అనేసరికి "నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేసేవాళ్ళం" అని చెప్పింది కాజల్. ఇలా నెక్స్ట్ వీక్ ఈ సుమ అడ్డా గేమ్ షో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. అందరూ కలిసి "నసబెల్లె" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఈ స్పూఫ్స్ లో భాగంగా ఈ షోకి వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు.
![]() |
![]() |